కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన నోయిడా జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయాని (Jewar Airport)కి ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన యూపీ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు.
ఇకపై ఈ విమానాశ్రయం ‘నరేంద్ర మోడీ అంతర్జాతీయ విమానాశ్రయం’గా పిలువబడుతుంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ అందిస్తున్న సేవలకు గుర్తుగా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ తరఫున ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు కేబినెట్ పేర్కొంది.
Also Read : తమిళనాడు ఉపఎన్నికల్లో విజయ్ వేవ్.. బెంగాల్‌లో బీజేపీ జోరు!
Follow Us On: Instagram

