సీఈసీ రాజీనామాకు డిమాండ్.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఎలక్షన్ కమిషన్ పనితీరు, ఇటీవల చేపట్టిన ఎలక్టోరల్ రోల్ సవరణ (SIR) ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భారత్ రాష్ట్ర సమితి (BRS) డిమాండ్ చేసింది. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర ఎన్నికల అధికారుల కార్యాలయం ఎదుట భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే ఏ ఒక్క వ్యక్తి గొప్ప కాదని స్పష్టం చేశారు. ఒకే ఒక్క వ్యక్తిని కాపాడేందుకు వ్యవస్థలన్నీ ఎందుకు ఇంతగా శ్రమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కొరవడిందని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారంపై అత్యున్నత నాయస్థానం స్పందించి, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>