ఈ నెల 10న సూర్యాపేటలో భారీ 2కే రన్: బడుగుల లింగయ్య

కలం, సూర్యాపేట: తెలంగాణ వ్యాప్తంగా నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘దశాబ్ది ఉత్సవాలు’ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ (Badugula Lingaiah Yadav) వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న (శనివారం) ఉదయం 6 గంటలకు సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు బతుకమ్మ ఘాట్ నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ 2కే రన్ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ 2కే రన్‌లో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తెలుపు రంగు టీ-షర్టులు ధరించి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2016 అక్టోబర్ 10న నాటి కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణే లక్ష్యంగా కొత్త జిల్లాలను అందుబాటులోకి తెచ్చిందని బడుగుల గుర్తుచేశారు.

గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్న సమయంలో మేళ్లచెరువు, తిరుమలగిరి వంటి సరిహద్దు ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లాగా మారిన తర్వాత ఇక్కడ మెడికల్ కళాశాల, కలెక్టరేట్, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటై వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందన్నారు.

నూతన జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను, జరిగిన సమగ్ర అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ దశాబ్ది వేడుకలను జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10న ఉదయం జరిగే 2కే రన్‌లో పౌరులంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

Also Read : మోదీ ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు.. అభిజీత్ దీప్కే ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>