డీప్ ఫేక్‌, సైబ‌ర్ మోసాల‌పై మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఏఐ దుర్వినియోగం, డీప్ ఫేక్‌ (Deepfake), సైబ‌ర్ మోసాల‌పై ప్ర‌ధాని మోదీ (PM Modi) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో నేడు ప్రారంభ‌మైన‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో మోదీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సైబ‌ర్ మోసాలు, డిజిట‌ల్ ముప్పుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌రిహ‌ద్దులు దాటి జ‌రుగుతున్న ఈ మోసాల‌పై ప్ర‌పంచ దేశాల‌న్నీ ఏక‌మై ఒక గ్లోబ‌ల్ ఫ్రేమ్ వ‌ర్క్ (Global Framework) ఏర్పాటు చేయాల‌ని మోదీ పిలుపునిచ్చారు.

ప్రభుత్వాలు, టెక్నాలజీ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు, ఆర్థిక సంస్థలు సమన్వయంతో పని చేస్తేనే ఇలాంటి నేరాలను అడ్డుకోవచ్చని తెలిపారు. జీఎస్‌ఎంఏ, ప్రపంచ టెలికాం సంస్థలు కలిసి వినియోగదారులకు సైబర్‌ మోసాలు చేరకుండా నిరోధించేందుకు ఒక సంయుక్త యంత్రాంగాన్ని తీసుకురావాలని కోరారు. భారత్‌లో సైబర్‌ మోసాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

టెక్నాలజీ విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువ కావాలంటే వారిలో నమ్మకం అత్యంత కీలకమని ప్రధాని (PM Modi) స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా ప్రచారంతో దేశంలో 5G సేవలు ప్రతి జిల్లాకు విస్తరించాయని, డేటా ధరలు అందుబాటులోకి రావడంతో సామాన్యులకు సైతం డిజిటల్ సేవలు సులభతరమయ్యాయని ఆయన తెలిపారు. టెలికాం రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, సైబర్ నేరాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించే దిశగా అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని ప్ర‌ధాని మోదీ అభిప్రాయపడ్డారు.

Also Read : మోదీ ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు.. అభిజీత్ దీప్కే ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>