మణుగూరులో ‘కాంగ్రెస్’ రణం.. గాంధీల అరెస్ట్‌పై పినపాక గర్జన!

కలం, ఖమ్మం బ్యూరో: ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్టును ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru)లో గురువారం కాంగ్రెస్ తీవ్ర నిరసన (Congress Protests) వ్యక్తం చేసింది.

​స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రధాన రహదారిపై రవాణా నిలిచిపోయింది. అనంతరం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ఓటు హక్కుపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి.

ప్రశ్నించే అగ్రనేతలను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే” అని మండిపడ్డారు. పౌరుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళనలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఐఎన్‌టీయూసీ లారీ యూనియన్, బొగ్గు ముఠా కార్మికులు, గుమాస్తాల సంఘం ప్రతినిధులు, యూత్, మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : తెలంగాణపై చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>