2028 జూన్ టార్గెట్.. SLBC పనులపై ఎమ్మెల్యే, కలెక్టర్ ఫోకస్!

కలం, అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం (SLBC Tunnel ) పనులను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ (MLA Vamsi Krishna) తో పాటు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ (Hemanta Keshav Patil) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని (షియర్‌ జోన్‌)ను దాటి 6 నెలల్లో సుమారు 700 మీటర్ల వరకు సొరంగం తవ్వడం జరిగిందని వివరించారు. సొరంగం పనులు మరింత వేగంగా కొనసాగేందుకు అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి వచ్చే లోకోమోటివ్‌తో చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

2028 నాటికి SLBC పనులు పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే

2028 జూన్‌ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిమీల మేర తవ్వకాలు మిగిలున్నాయని అధికారులు వివరించారు. త్వరలోనే పనులు పూర్తి చేసి త్రాగు సాగునీటి నీటిని వినియోగించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చెబ్రా, SLBC ప్రాజెక్టు అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>