తెలంగాణపై చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయాల వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్-1’గా ఉందని కామెంట్స్ చేశారు. 1990లో దేశంలో వచ్చిన ఐటీ విప్లవాన్ని తాను ముందుగానే గుర్తించి, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నానని ఆయన చెప్పారు.

ఢిల్లీలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే నేడు తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు (Chandrababu) గుర్తుచేశారు. అలాగే CIIతో తనకు సుమారు 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. 1995–96లో CII కార్యకలాపాలను ప్రోత్సహించానని, అందుకే CIIపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తిగా మారాయి.

Also Read : 16న విశాఖలో వైసీపీ బీసీ గర్జన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>