సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. వేడుకలకు హరీశ్​ రావు పిలుపు

కలం, వెబ్​ డెస్క్​ : సిద్దిపేట జిల్లా (Siddipet District) ఆవిర్భావానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ‘పదేళ్ల పండుగ’ను ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు (Harish Rao) పిలుపునిచ్చారు. నాడు ప్రజల నినాదాలు, ఆకాంక్షలుగా ఉన్న ఎన్నో కలలు.. నేడు సాకారమై అభివృద్ధి ఫలాలను అందుకొంటుందన్నారు. 2016 అక్టోబర్ 11న జిల్లాను కేసీఆర్​ ప్రారంభించి పది సంవత్సరాలు అవుతున్నందున్న అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు పదేళ్ల పండుగ కార్యక్రమాలు అత్యంత వైభంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా (Siddipet District) ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు సాధించిన ప్రగతి, అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని హరీశ్​ రావు కోరారు. ఈ దశాబ్ది వేడుకల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పదేళ్ల పండుగను విజయవంతంగా నిర్వహించి సిద్దిపేట జిల్లా ప్రస్థానాన్ని ఘనంగా చాటుకుందామని హరీశ్​ రావు విజ్ఞప్తి చేశారు.

Also Read : శ్రీశైలం నీటి పోరు: తెలంగాణ సర్కార్ కీలక అడుగులు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>