కలం, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త పార్టీ పెట్టబొతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికి పరితమైతే అధికారం సిద్ధించదని.. తమ పార్టీ అన్ని కులాలు, మతాలను కలుపుకుపోతుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఒకటో స్థానంలో ఉంటే రెండో స్థానంలో వైసీపీ ఉందని.. తాము పెట్టబోయే పార్టీ మూడో స్థానంలో ఉంటుందని ఆయన (Vijayasai Reddy) వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు కులాన్ని ఉపయోగించుకుంటే.. వైఎస్.జగన్ (YS Jagan) మతాన్ని ఉపయోగించుకుంటున్నారని విజయసాయి రెడ్డి కీలక ఆరోపణలు చేశారు.
Also Read : తిరుమలలో దారి అడిగే పని ఇక లేదు.. భక్తుల కోసం TTD కొత్త యాప్ ఇదే!
Follow Us On: X(Twitter)

