తిరుమలలో దారి అడిగే పని ఇక లేదు.. భక్తుల కోసం TTD కొత్త యాప్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎవరి సహాయం లేకుండా తాము వెళ్లాల్సిన ప్రాంతాలకు సులువుగా చేరుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ‘గరుడ మ్యాప్’ అనే కొత్త యాప్‌ (Garuda Map App)  ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ యాప్‌లో తిరుమల క్షేత్రానికి సంబంధించిన సకల సమాచారం అందుబాటులో ఉంది. తిరుమలలోని ఆలయాలు, క్యూలైన్లు, వసతి గృహాలు, వేచి ఉండే కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల పూర్తి సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది.

భక్తులు యాప్ (Garuda Map App) ఓపెన్ చేసి ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశం పేరు నమోదు లేదా వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. ఆ ప్రాంతానికి తేలికగా చేరుకోవచ్చు. అంతే కాకుండా నడిచి వెళితే ఎంత దూరం, వాహనంలో వెళితే ఎంత దూరం, చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఈ యాప్‌లో కనిపిస్తుంది.

Also Read : ప్రయాణికులకు అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>