ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత

కలం, వెబ్ డెస్క్ : భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ (Nana Patekar) (75) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఆయన గురువారం ఉదయం స్పృహతప్పి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఉదయం 5:20 గంటల ప్రాంతంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన అనంతరం వైద్య బృందం ఆయనను కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు శ్రమించింది. అయినప్పటికీ ఆయన శరీరం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆయన మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

నానా పటేకర్ హఠాన్మరణ వార్తతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హిందీ, మరాఠీ భాషల్లో తనదైన విలక్షణ నటనా శైలితో, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>