కలం, వెబ్ డెస్క్ : జీఎస్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలపై చర్చించేందుకు గురువారం 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (57th GST Council Meeting) కానుంది. ఢిల్లీలోని భారత్ మండపంలోని సమ్మిట్ రూమ్ లో భేటీ ప్రారంభం కానుంది. మొదటగా అక్టోబర్ 7వ తేదీన కౌన్సిల్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఒక రోజు వాయిదా వేశారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కు కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నులు, రిఫండ్లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), పన్ను చెల్లింపుదారులకు అనుగుణంగా నిబంధనల సరళీకరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

