మహిళా పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజ్ కీలక సూచనలు

కలం, ఖమ్మం బ్యూరో : మారే సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆధునిక పోలీసింగ్‌లో మహిళా సిబ్బంది ముందంజలో ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మహిళా పోలీసులకు నిర్వహించిన “ఐసీసీ” మరియు “పోష్ చట్టం”(POSH Act) అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నాట్ గ్రిడ్, గాండీవ, సహాయోగ్ వంటి వెబ్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. పోష్ చట్టం–2013పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను ఐసీసీ కమిటీకి లేదా నేరుగా తన దృష్టికి నిర్భయంగా తీసుకురావచ్చని తెలిపారు. మహిళా ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో, భద్రతతో పనిచేసేలా అనుకూల వాతావరణం కల్పించడమే తమ ప్రాధాన్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఐసీసీ అధికారులు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>