ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో మరో భవనం కుప్పకూలింది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలింది. ఈ ఘటన (Delhi Building Collapse) లో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో భవనం కూలిపోయినట్లు స్థానికులు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

కాగా, నెలరోజుల క్రితం ఢిల్లీలోని సత్య నికేతన్‌లోని ఓ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెంది, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తరువాత బుధవారం రాజధానిలో మరో భవనం కూలిపోవడం (Delhi Building Collapse) ఆందోళన కలిగిస్తోంది.

Also Read : శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో సంచలనం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>