కలం, వరంగల్: నల్లబెల్లి (Nallabelli) మండల కేంద్రంలో ఓ రైతు పొలంలో పెద్ద కొండ చిలువ కనిపించడం కలకలం రేపింది. స్థానిక రైతు పెద్ది కృష్ణారెడ్డి పొలంలో సుమారు 9 అడుగుల పొడవైన కొండు చిలువ తిరుగుతుండగా రైతులు గుర్తించారు. దాన్ని చాకచక్యంగా పట్టుకొని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకొని కొండ చిలువను స్వాధీనం చేసుకున్నారు. అనతరం దానిని పాకాల అభయారణ్యంలో వదిలిపెట్టారు. కొండ చిలువ కనిపించడంతో చుట్టుపక్కల పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read : ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..
Follow Us On: X(Twitter)

