మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ.. నిర్మల్‌‌లో ఘనంగా ‘సేవా జ్యోతి యాత్ర’!

కలం, నిర్మల్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’, ‘సేవా జ్యోతి కలశం యాత్ర’ (Seva Jyoti Yatra ) నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్‌లోని ఆర్కే కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ స్క్రీన్‌పై ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.

ఈ సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నిరంతరాయంగా 25 ఏళ్లపాటు అందించిన ప్రజాసేవ దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం తదితర రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మోదీ సేవా స్ఫూర్తికి కృతజ్ఞతగా సేవా జ్యోతి కలశం యాత్ర (Seva Jyoti Yatra) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే సేవా జ్యోతి కేవలం ఒక కార్యక్రమం కాదని.. సేవ, త్యాగం, అంకితభావం, నిబద్ధతకు ప్రతీకగా నిలిచే జాతీయ సంకల్పమని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి, సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం శివాజీ చౌక్ నుంచి మినీ ట్యాంక్‌బండ్ వరకు సేవా జ్యోతి కలశం యాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ చిత్రపటాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, జిల్లా ఇన్చార్జి గోపిడి శ్రావణి రెడ్డి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Also Read : జ‌పాన్‌లో వినూత్న పోటీ.. నిద్ర పోతే ల‌క్ష‌ల్లో బ‌హుమ‌తి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>