ముషీరాబాద్‌లో నకలీ ఫామ్-7 కలకలం: బిఎల్‌ఏపై ఎఫ్‌ఐఆర్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ముషీరాబాద్ (Musheerabad) నియోజకవర్గంలో నకిలీ ఫామ్-7 దరఖాస్తులతో ఓటర్ల పేర్లను తొలగించేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముషీరాబాద్‌కు చెందిన బిజెపి బూత్ లెవల్ ఏజెంట్ (BLA) ఎస్. బాలాచందర్ 30 ముస్లిం ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ప్రి-ప్రింటెడ్ ఫామ్-7 దరఖాస్తులను సమర్పించారు. అందులో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ పేరు కూడా ఉంది. అయితే, ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరించిన ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

విచారణలో ఆ 30 మంది ఓటర్లు తమ నమోదిత చిరునామాల్లోనే నివసిస్తున్నట్లు స్పష్టమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి బల్క్ దరఖాస్తులు సమర్పించి, అధికారుల నిరాకరణ తర్వాత ఫామ్‌లను అక్కడే వదిలేసి బాలాచందర్ వెళ్లిపోయారని పోలీసుల నివేదికలో పేర్కొన్నారు. దీంతో అతనిపై బిఎన్ఎస్ సెక్షన్లు 217, 318(2)తో పాటు ఆర్‌పిఎ సెక్షన్ 31 కింద కేసులు నమోదు చేశారు. బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>