పాము ఎక్కడొస్తుందో ముందే తెలుసుకోవచ్చు..!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (ఎఫ్ఓఎస్) పాముల సంచారాన్ని ముందుగానే అంచనా వేసే సరికొత్త వ్యవస్థను (Snake Movement Prediction) సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. పాములు కనిపించే అవకాశం ఉన్న ప్రాంతాలు, సమయాలపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి పాముకాటు ఘటనలను తగ్గించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందిస్తోంది.

మెషిన్ లెర్నింగ్ మోడల్‌తో అనుసంధానం..

2024, 2025లో తెలంగాణలో నమోదైన 35,234 పాము రక్షణ చర్యల రికార్డులను విశ్లేషించి, వాతావరణ పరిస్థితులు, సూర్యరశ్మి వివరాలను మెషిన్ లెర్నింగ్ మోడల్‌తో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 72 ప్రాంతాలను కవర్ చేస్తోంది. వాతావరణ ఆధారంగా పాముల సంచారాన్ని అంచనా వేయడంలో ఈ మోడల్ 90 శాతం వరకు కచ్చితత్వం సాధించినట్లు ఎఫ్ఓఎస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ సి.విశ్వనాథన్ స్పష్టం చేశారు.

15 రోజుల ముందుగానే తెలిసేలా..!

శ్రీలంకలోని క్యాండీలో జరిగిన తొలి ప్రపంచ పాముల సదస్సులో ఎఫ్ఓఎస్ ఈ వాతావరణ ఆధారిత మెషిన్ లెర్నింగ్ మోడల్‌ను ప్రదర్శించింది. పాముల సంచారం పెరిగే సమయాల్లో ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, రక్షణ బృందాలు కూడా అవసరానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని విశ్వనాథన్ తెలిపారు. భవిష్యత్తులో 15 రోజుల ముందుగానే పాముల కదలికలను అంచనా వేసేలా మోడల్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వనాథ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>