పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు ఎమర్జెన్సీ ఆపరేషన్!

కలం, వెబ్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని కో–పైలట్ హైజాక్ చేయకుండా అడ్డుకుని 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ (Pilot Smit Machchhar) తలకు బలమైన గాయమైంది. యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్ఛర్‌కు ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. అతడి పుర్రెలో కొంత చీలిక వచ్చిందని.. దీన్ని డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్‌గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

స్మిత్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని.. తగ్గించేందుకు హై డోస్ మెడిసిన్స్ ఇస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. న్యూరాలజిస్టులు కూడా మెదడు పనితీరుని స్కానింగ్ చేస్తున్నారని తెలిపారు. స్మిత్ వేగంగా కోలుకుంటున్నారని.. చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని వెల్లడించారు. కొద్దిగా నడవడం, ఆహారం తీసుకోవడం ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన్ను కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడేందుకు అనుమతించారు.

తలపై దాడి చేసినట్లు గుర్తుంది..

కో–పైలట్‌గా వ్యవహరించిన హమామ్–అల్–హమామ్మి విమానాన్ని హైజాక్ చేసి, క్రాష్ చేయాలనే ఉద్దేశంతో స్మిత్ మచ్ఛర్‌పై బలమైన ఆయుధంతో దాడి చేశాడు. కొన్ని నరాలు దెబ్బతిన్నాయని.. ఇది అతడి చూపు, జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహుతో స్మిత్ మచ్ఛర్ మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. ‘నాకు కొంచెం కొంచెం గుర్తుంది. కాక్‌పిట్‌లో అతను నా తలపై దాడి చేశాడు. దీంతో కంటి చూపు మందగించింది. ముందు ఏం ఉందో అసలేం కనిపించలేదు, శక్తినంత కూడదీసుకుని తలుపు తెరవగలిగాను’ అన్నారు.

కొనసాగుతున్న విచారణ..

విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో–పైలట్ అల్–హమామ్మిని యూఏఈ అధికారులు విచారిస్తున్నారు. దర్యాప్తులో ఇజ్రాయెల్ నుంచి వచ్చిన షిన్ బెట్ అధికారులు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇజ్రాయెల్ వెళ్లే విమానాలనే లక్ష్యంగా చేసుకున్న కో పైలట్.. ఈ ఏడాది ప్రారంభంలోనే హైజాక్ చేసి కూల్చివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్ పౌరులను చంపడమే లక్ష్యంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారించారు. అయితే దర్యాప్తు జరుగుతున్న తీరుపై వివరాలు వెల్లడించేందుకు యూఏఈ అధికారులు, ఫ్లై దుబాయ్ సంస్థ నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>