పేదల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై కలెక్టర్‌ ఫోకస్‌

కలం, ఆదిలాబాద్: జిల్లాలోని పేదలకు కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో (Double-Bedroom Houses) మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేసి, సకల సౌకర్యాలతో ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాల పురోగతి, కాలనీల్లో అవుట్‌సైడ్‌ పెయింటింగ్‌, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాలనీల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అంతర్గత గ్రావెల్‌ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పైప్‌లైన్‌ విస్తరణ, నల్లాల ఫిట్టింగ్‌ తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, అదనపు కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌. చిత్రు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>