ఘనంగా అంతర్ కళాశాల హ్యాండ్‌బాల్ పోటీలు

కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ కళాశాల హ్యాండ్‌‌బాల్ (పురుషులు, మహిళల) పోటీలు మంగళవారం అత్యంత కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ పసుపుల మద్దిలేటి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అంతర్ కళాశాల పోటీల్లో (Inter College Handball Competitions)  ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహిళల విభాగంలో 6 జట్లు, పురుషుల విభాగంలో 4 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వీటితో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ (ఐయూటీ) పోటీల ఎంపికల కోసం వివిధ కళాశాలలకు చెందిన పలువురు క్రీడాకారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. హ్యాండ్‌బాల్ ఐయూటీ సెలక్షన్స్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గుప్తా పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళల విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆర్. మురళి, పురుషుల విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వై. శ్రీనివాసరెడ్డిలతో పాటు పలు కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు (పీడీలు), ఉమ్మడి జిల్లాకు చెందిన హ్యాండ్‌బాల్ క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>