కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Manne Krishank)కు సికింద్రాబాద్ పదో మెట్రిపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి రూ.50 వేల కోట్ల బినామీ ఆస్తులున్నాయంటూ మన్నె క్రిశాంక్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో హాజరుపర్చారు.
కేసును విచారించిన మెజిస్ట్రేట్ మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. రిమాండ్ విధించాలన్న పోలీసుల వాదనలను తోసిపుచ్చారు. సీఎం రేవంత్, ఆయన కుటుంబ సభ్యులపై క్రిశాంక్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. క్రిశాంక్ అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

