కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ సినిమాలకు గ్యాప్ రావడం జరిగింది. దాదాపు మూడేళ్ళ పాటు ప్రభాస్ నుంచి సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. బాహుబలి విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అయితే ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తాడు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి ఫ్యాన్స్ ని అలరించాలని ఎప్పుడూ అనుకుంటాడు. ఇదే విషయాన్ని స్వయంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం రెండు సినిమాలను కచ్చితంగా రిలీజ్ చేస్తానని ప్రభాస్ ఫ్యాన్స్ కి మాటిచ్చారు.
ఈ ఏడాదిలో జనవరి 9న “ది రాజాసాబ్” (The Rajasaab) మూవీ గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తర్వాత ఆగష్టు 15న ఫౌజీ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనితో 2026లో ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు. అయితే వచ్చే ఏడాది కూడా ఇలాగే ప్రభాస్ (Prabhas) నుంచి రెండు సినిమాలు వస్తాయా అనేది ప్రశ్నగా మారింది. సందీప్ వంగాతో చేస్తున్న స్పిరిట్ (Spirit) మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. కల్కి 2 (Kalki 2) సినిమా కనుక సెట్స్ పైకి వెళ్తే మాత్రం వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రావడం ఖాయం అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో సలార్ 2 (Salaar 2) షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.
Read Also: రజనీ, కమల్ మూవీ బిగ్ అప్డేట్ .. స్పెషల్ పోస్టర్ వైరల్
Follow Us On: Sharechat


