కేటీఆర్ పై కవ్వంపల్లి ఆగ్రహం

కలం, కరీంనగర్ : కేటీఆర్‌ కుటుంబం మొత్తం కలిసి ఉండేందుకు నివాసయోగ్యమైన ఇల్లు లేదని కేటీఆర్‌ చెప్పడం ముమ్మాటికీ అబద్ధమని ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) అన్నారు. సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించిన ఓటర్ల వివరాలతో కేటీఆర్‌ అబద్ధాల కోరు అన్న విషయం తేటతెల్లమైందని విమర్శించారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటం కేటీఆర్‌కే చెల్లిందని కవ్వంపల్లి ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలకు సొంతంగా నివాసయోగ్యమైన ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో.. తమ కుటుంబానికి కూడా సరైన ఇల్లు లేదని కేటీఆర్‌ చెప్పడం చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలకులు ప్రజా ఆస్తులను కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. పదేళ్ల పాలనలో పేదలకు కనీసం రేషన్‌ కార్డులు కూడా ఇవ్వడం చేతకాలేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండారి తిరుపతి, ప్యాక్స్‌ చైర్మన్లు గోపగాని బసవయ్యగౌడ్‌, కాజల్‌ మహేష్‌, కీసర సంపత్‌, ఏఎంసి వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, పార్టీ నాయకులు ఉప్పుగల్ల మల్లారెడ్డి, గొట్టే మధు, మధుకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>