రేపు మెదక్ జిల్లాలో గవర్నర్ పర్యటన

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మెదక్‌ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (ఐడీఓసీ) మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఐడీఓసీలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో భేటీ అవుతారు. అనంతరం నూతనంగా ఎన్నికైన భారతీయ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ నుంచి రామాయంపేటకు బయలుదేరి, 3.30 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు అన్ని రకాల ఏర్పాట్లు, పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>