కరీంనగర్ లో దారుణం.. బాలికపై వృద్ధుడి లైంగికదాడి!

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలో 7వ తరగతి చదువుతున్న బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఓ వృద్ధుడు సెల్‌ఫోన్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వృద్ధుడి వికృత చేష్టలను సమీపంలో ఉన్న కొందరు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.

​అయితే ఈ సంఘటన బయటకు పొక్కకుండా గ్రామానికి చెందిన కొందరు కుల సంఘం నాయకులు రాయబారం సాగిస్తున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వృద్ధుడు సైతం “తనేమీ తప్పు చేయలేదు” అని బుకాయిస్తూ, బాలిక కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>