రఫిక్‌కు రేవల్లి మైనారిటీ సెల్‌ పగ్గాలు

కలం, వనపర్తి: రేవల్లి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ రఫిక్ (MD Rafiq) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ సుల్తాన్‌ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మైనారిటీల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు రఫిక్‌ పిలుపు నిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, ఉపాధి, మహిళా సాధికారత పథకాలను మైనారిటీలకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్‌బోర్డు సభ్యుడు అబ్దుల్‌ సలీం, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి పర్వతాలు, సర్పంచ్‌ రాజయ్య, గురునాథ్‌రెడ్డి, బండారు శ్రీను, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>