కలం, వెబ్ డెస్క్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. ఈ పనుల్లో ఇప్పటివరకు 700 మీటర్ల మేర పురోగతి కనిపించిందని.. షియర్జోన్ దాటి తవ్వకాలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. టన్నెల్ పనులను వేగవంతం చేసేందుకు అదనపు డ్రిల్లింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెలాఖరుకు జర్మనీ నుంచి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ యంత్రాన్ని తీసుకురానున్నట్లు మంత్రి (Uttam Kumar Reddy) వివరించారు. ఈ యంత్రంతో తవ్వకాలు మరింత సులువు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపిన మంత్రి.. 2028 జూన్ నాటికి ఆయకట్టు ప్రజలకు నీరు అందించేలా పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీలకు పైగా నీరందించడం లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read : ఓటు హక్కు తొలగింపు రాజ్యాంగ విరుద్ధం: జస్టిస్ ఉజ్జల్
Follow Us On : WhatsApp

