ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి

​కలం, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) కన్నుమూశారు. వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 94 ఏళ్ల వయస్సులో సింగీతం శ్రీనివాసరావు ఇటీవల ‘సింగ్ గీతం’ అనే మూవీకి దర్శకత్వం కూడా వహించి రికార్డు సృష్టించారు. ఈ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక బాలకృష్ణతో ఆయన చేసిన ‘ఆదిత్య 369’ చిత్రం ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. కమల్ హాసన్ తో తీసిన ‘పుష్పక విమానం’ సినీ చరిత్రలోనే ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మయూరి, భైరవ ద్వీపం వంటి విభిన్న చిత్రాల దర్శకుడిగా ఎంతో పేరొందిన సింగీతం మరణించడంపై పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>