కలం, నిర్మల్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 7న నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సేవా జ్యోతి కలశ యాత్రను (Seva Jyoti Kalash Yatra) విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, జిల్లా ఇన్చార్జి గోపిడి స్రవంతి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సేవా జ్యోతి కార్యక్రమం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా జ్యోతి కలశ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. యాత్ర అనంతరం ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అక్టోబర్ 7న దేశవ్యాప్తంగా సేవా జ్యోతి కలశ యాత్రలు నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మెడిసెమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్నారెడ్డి, కలిపే విలాస్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, నల్ల రమేష్, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

