కలం, స్పోర్ట్స్: పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టులో చెలరేగిన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) వివాదం కొత్త మలుపు తిరిగింది. నేషన్స్ లీగ్‌లో డెన్మార్క్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు రొనాల్డో జట్టును వీడటంతో పెద్ద దుమారమే రేగింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య నేరుగా రంగంలోకి దిగింది. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు సమైక్య అధికారులు వచ్చే వారం రొనాల్డోతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రొనాల్డో అంగీకారంతో జరగనున్న ఈ భేటీలో కోచ్ జార్జ్ జీసస్ కూడా పాల్గొననున్నారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన రొనాల్డోకు తగిన గౌరవంతో వీడ్కోలు పలికేలా చూడటమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
డెన్మార్క్‌తో జరిగే మ్యాచ్‌లో రొనాల్డోను తుది జట్టులో ఆడించబోనని కోచ్ జార్జ్ జీసస్ స్పష్టం చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రొనాల్డో కోపెన్‌హేగన్‌లోని శిక్షణ శిబిరాన్ని వీడి స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు వెళ్లిపోయారు. అయితే, దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతానని రొనాల్డో వెల్లడించారు. రొనాల్డో జట్టును వీడే సమయంలో సమాఖ్య అధ్యక్షుడు పెడ్రో ప్రోయెంకా, కోచ్ జార్జ్ జీసస్ ఆయనను వారించేందుకు విమానాశ్రయం వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. మరోవైపు జట్టు దృష్టంతా రాబోయే మ్యాచ్‌లపైనే ఉందంటూ సమైక్య అధికారిక ప్రకటన విడుదల చేసింది.

