పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబ్ నగర్ పోలీసుల సత్తా.. రెండు పతకాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 (Telangana Police Sports Meet 2026) లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ లింగం, మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్ ల జోడీ అద్భుతంగా రాణించి రజత పతకం కైవసం చేసుకుంది. అదేవిధంగా లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఇమ్రాన్, హెడ్ కానిస్టేబుల్ లింగంల జోడీ కాంస్య పతకం సాధించి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పతకాలు సాధించిన ముగ్గురు పోలీస్ క్రీడాకారులను మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ చాంబర్‌లో జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) శనివారం అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు. క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఏకాగ్రత, జట్టు స్ఫూర్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, వారు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచేలా అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వర్టికల్ డీఎస్పీ బాలాజీ, ఎస్‌పీసీసీ రామ్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవి బాబు, డీటీసీ ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యారసాని సురేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : ట్రిప్‌‌కు వెళ్లిన హీరోయిన్‌‌కు ప్రమాదం.. విరిగిన వెన్నెముక!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>