కలం, భైంసా: భైంసా (Bhainsa) పట్టణంలోని పద్మావతి కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు శనివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(MLA Ramarao Patel) నిధుల మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆలయ షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు వెండి, బంగారు వర్తక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

