రేవంత్‌ రెడ్డికి షాక్.. కొడంగల్‌లో బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ !

కలం, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ (KTR) కంచుకోట సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టడం, త్వరలో హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేటలోనూ నిర్వహించాలని ప్లాన్ చేసుకోవడంతో బీఆర్ఎస్‌ అలర్ట్ అయింది. దీనికి కౌంటర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో సభ (BRS Kodangal Meeting) పెట్టాలని ఆలోచన చేస్తున్నది. సిద్దిపేటలో ఈ నెల ఫస్ట్ వీక్‌లో సీఎం సభ ఉన్నందున, అది పూర్తయిన తర్వాత కొడంగల్‌పై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నది.

ముఖ్యమంత్రికి ఆయన సొంత గడ్డ మీదనే సవాల్ విసిరే తీరులో భారీ సభ నిర్వహించాలని కసరత్తు చేస్తున్నది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ (Talasani) శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వెల్లడించారు. సిరిసిల్ల సభతో బీఆర్ఎస్ కోటను సీఎం కదిలించలేకపోయారని, కానీ తాము మాత్రం ముచ్చెమటలు పట్టిస్తామని వ్యాఖ్యానించారు. కొడంగల్ సభపై త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్‌‌తో చర్చించి తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. అయితే ఆ సభకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న దానిపై మాత్రం తలసాని క్లారిటీ ఇవ్వలేదు.

మాకు మైలేజ్‌.. సీఎంకు డ్యామేజ్

కొడంగల్‌లో తమ పార్టీ నిర్వహించబోయే సభ (BRS Kodangal Meeting).. సీఎం రేవంత్‌రెడ్డినే కాక మొత్తం కాంగ్రెస్ పార్టీ పునాదులనే కదిలించేలా ఉంటుందని తలసాని వ్యాఖ్యానించారు. ‘‘ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ఎక్కడైనా పర్యటించవచ్చు. ఆయన సిరిసిల్లకు వెళ్లడాన్ని కూడా మేం తప్పుపట్టడం లేదు. కానీ అక్కడ సభ నిర్వహించిన తీరు, సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేవలం బలప్రదర్శనగానే సిరిసిల్ల సభను సీఎం నిర్వహించారు. సిద్దిపేటలోనూ దండయాత్ర చేస్తామని సీఎం చెప్తున్నారు.

ఆ సభ పూర్తయిన తర్వాతే మేం కొడంగల్‌లో సభ నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి ఊహించని తీరులో బీఆర్ఎస్ సభ ఉంటుంది. సొంత గడ్డపైనే సీఎం రేవంత్‌తో పాటు ఆయన సోదరుల బండారాన్ని బట్టబయలు చేస్తాం” అని అన్నారు. ‘‘సిరిసిల్లలో నిర్వహించిన సభతో ముఖ్యమంత్రికి మైలేజ్ కంటే నష్టమే ఎక్కువ జరిగింది. కానీ కొడంగల్ సభ మాత్రం మా పార్టీకి మైలేజ్ ఇస్తుంది.. సీఎంను డ్యామేజ్ చేస్తుంది. ఈ సభతో రాష్ట్రంలో ఎలాంటి గాలి వీస్తున్నదో సీఎంకు స్పష్టంగా తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు.

ఖైరతాబాద్‌లో గెలుస్తాం..

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక (Khairatabad Bypoll) ఎప్పుడెస్తుందో తెలియదు గానీ.. ఎప్పుడొచ్చినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థేనని తలసాని ధీమా వ్యక్తం చేశారు. ‘‘పార్టీ మారినందుకు దానం నాగేందర్ నైతికంగా తప్పుకుంటే ప్రజల్లో కాస్తయినా గౌరవం, విశ్వాసం ఉండేది. కానీ కోర్టులే అనర్హుడిగా ప్రకటించడం ఆయన పొలిటికల్ కెరీర్‌కే మచ్చలాంటిది. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసినందుకే గెలిచారు. కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేక కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

దీంతో ప్రజల్లో ఆయనపై ఆగ్రహం ఉన్నది. గతంలో ఓటింగ్‌లో పాల్గొననివారు ఈసారి కచ్చితంగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు.. ప్రజలు కసితో ఓడిస్తారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరో రకమైన పరిస్థితితో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఖైరతాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి, దానం నాగేందర్‌కు చేదు అనుభవం తప్పదు” అని అన్నారు.

Also Read : కోర్టు ఆదేశాలు బేఖాతరు: సీపీ సజ్జనార్‌కు ఊహించని షాక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>