కోర్టు ఆదేశాలు బేఖాతరు: సీపీ సజ్జనార్‌కు ఊహించని షాక్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ (Sajjanar)కు తెలంగాణ హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తలాబ్ కట్టకు చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తి తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినా భవానీనగర్ సీఐ, ఎస్‌ఐలు అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ సజ్జనార్ ఎటువంటి విచారణ జరపలేదంటూ బాధితుడు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై స్పందించిన హైకోర్టు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సజ్జనార్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

Also Read : రేవంత్‌ రెడ్డికి షాక్.. కొడంగల్‌లో బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ !

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>