విశాఖ విద్యార్థుల మృతదేహాలు లభ్యం

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం తీరంలో విహారానికి వెళ్లిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయిన (Vizag Drowning) ఘటన తీవ్ర శోకాన్ని నింపింది. సరదాగా స్నానానికి దిగి నీటి ప్రవాహంలో గల్లంతైన విద్యార్థుల కోసం మెరైన్ పోలీసులు, స్థానిక ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల ద్వారా మృతదేహాలు లభ్యమయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే ఒక విద్యార్థి ప్రశాంత్ మృతదేహం లభించగా, సముద్రంలో మిగిలిన ఇద్దరు విద్యార్థులు నితీష్, సూర్యప్రకాష్‌లకు సంబంధించి శోధించడంతో వారి మృతదేహాలు కూడా తీరానికి కొట్టుకొచ్చాయి. ఒక్కసారిగా ముగ్గురు పిల్లలు అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు తీరంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>