ఆగి ఉన్న లారీని ఢీకొన్న బొలెరో.. ఇద్దరు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని మర్రిబంద వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Anakapalli Accident) జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాద ధాటికి బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను సేకరించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>