కాంగోలో ఎబోలా కల్లోలం.. 4 వేలకు పైగా మరణాలు!

కలం, వెబ్ డెస్క్ : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ (Ebola Virus) కల్లోలం సృష్టిస్తోంది. ఆఫ్రికన్ దేశమైన కాంగోలో ఈ మహమ్మారి దాటికి ఇప్పటివరకు 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య ఏకంగా 8,300 మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత అరుదైన ‘బుండిబుగ్యో’రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దీన్ని అదుపు చేయడం ఆరోగ్య రక్షణ బృందాలకు పెద్ద సవాలుగా మారింది.

బాధిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, స్థానిక సాయుధ సమూహాల ఘర్షణలు, ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం వ్యాధి నియంత్రణ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారుతోంది. కాగా, సరిహద్దు దేశాలకు కూడా ఈ వైరస్ పాకే ప్రమాదం ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే విధానం:

ఎబోలా ముఖ్యంగా వ్యాధి సోకిన వ్యక్తి రక్తంతో సహా ఇతర శారీరక ద్రవాలు (రక్తం, లాలజలం, చెమట, వాంతులు, మూత్రం, వీర్యం) ద్వారా నేరుగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు ఉపయోగించిన సూదులు, దుస్తులు, లేదంటే వారు స్పర్శించిన వస్తువులను తాకడం ద్వారా కూడా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ఈ వైరస్ సోకుతుంది. అలాగే, వ్యాధి బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాల సమయంలో మృతదేహాలను తాకడం, అలాగే అడవుల్లో ఉండే గబ్బిలాలు, కోతులు వంటి వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తాకడం భుజించడం ద్వారా కూడా ఈ వైరస్ మనుషులకు వేగంగా సంక్రమిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>