ఆస్తి కోసం నాటకమాడి.. చివరికి సీన్ రివర్స్!

కలం, వెబ్ డెస్క్: వృద్ధ దంపతుల ఆస్తి కొట్టేద్దామని ఇద్దరు వ్యక్తులు ఆడిన నాటకం బెడిసి కొట్టింది. రంగారెడ్డి జిల్లా సీతారాంపేట (Seetharampet) గ్రామానికి చెందిన పిశాటి లక్ష్మారెడ్డి (75), రాములమ్మ దంపతులకు అయిదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు శ్రీనివాస్ రెడ్డి 23 ఏళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయ.. తిరిగి రాలేదు. ఎన్నో ప్రాంతాల్లో వెతికినా అతడి జాడ దొరకలేదు. ఒక్కానొక్క కుమారుడు ఎప్పటికైనా రాకపోతాడా.. అని వృద్ధ దంపతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మారెడ్డికి మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి.. మీ కుమారుడు బతికే ఉన్నాడని.. నార్కట్ పల్లి ఆలయం దగ్గర ఉంటున్నాడని నమ్మించాడు.

లక్ష్మారెడ్డి దంపతులు మొదట నమ్మకపోయినా.. మోహన్ రెడ్డి వెంట నార్కట్‌పల్లి వెళ్లాడు. అక్కడొక వ్యక్తిని చూపించిన మోహన్ రెడ్డి.. అతడే తప్పిపోయిన మీ కొడుకు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పాడు. సదరు వ్యక్తికి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర వివరాలు అప్పటికే చెప్పి సిద్ధం చేసి ఉంచడంతో గుర్తులు, బంధువుల పేర్లు చెప్పి లక్ష్మారెడ్డిని నమ్మించాడు. ఇక అతనే తమ కొడుకు శ్రీనివాస్ రెడ్డి అని కూడా వృద్ధ దంపతులు నమ్మారు.

మాల తీసేయాలంటే రూ.40 లక్షలు..

శ్రీనివాస్ రెడ్డిగా చెబుతున్న వ్యక్తి మాల ధరించి ఉన్నాడు. అది తీసేసి ఇంటికి రావాలంటే రూ.40 లక్షలు అవుతుందని, అలాగే తన కుమార్తె ఆరోగ్యం బాగా లేదని మరో రూ.లక్ష ఇవ్వాలని లక్ష్మారెడ్డిని కోరాడు. దీంతో లక్ష్మారెడ్డికి అనుమానం వచ్చి.. డీఎన్ఏ టెస్ట్ చేయించుకుందామని చెప్పడంతో ఇద్దరు వ్యక్తులు భయపడిపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్ రెడ్డిగా నటించిన వ్యక్తి పేరు రేవల్లి యాదయ్యగా గుర్తించారు. వృద్ధ దంపతుల ఆస్తి కొట్టేసేందుకు ఇద్దరు కలిసి నాటకం ఆడినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. యాదయ్యను అరెస్ట్ చేయగా.. మోహన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>