పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో రామగుండం క్రీడాకారుల హవా

కలం, రామగుండం :  పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 (Telangana Police Sports and Games Meet 2026) క్లస్టర్–సీ పోటీలు హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు జరిగాయి. ఈ పోటీల్లో కాళేశ్వరం జోన్–1 తరఫున పాల్గొన్న రామగుండం(Ramagundam) పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ఒక రజతం, ఆరు కాంస్య పతకాలు సాధించి మొత్తం ఏడు పతకాలను కైవసం చేసుకున్నారు. కమిషనరేట్ తరఫున మొత్తం 17 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

పతకాల వివరాలు:
టేబుల్ టెన్నిస్ – 5 కాంస్యాలు

50+ మిక్స్‌డ్ డబుల్స్: ఏసీపీ ప్రతాప్, డబ్ల్యూపీసీ ఎం. వనిత
40+ సింగిల్స్: పీసీ ఎం. ఉదయ్ కిరణ్, పీసీ-3499
ఓపెన్ ఉమెన్స్ డబుల్స్: డబ్ల్యూపీసీ కె. విజయ, కె. దీప
40+ ఉమెన్స్ డబుల్స్: డబ్ల్యూపీసీ ఎం. వనిత, కె. విజయ, పీసీ-1469
40+ మిక్స్‌డ్ డబుల్స్: పీసీ డి. రాజేందర్, పీసీ-2952, డబ్ల్యూపీసీ ఎం. వనిత

బ్యాడ్మింటన్ – 1 రజతం, 1 కాంస్యం

ఓపెన్ సింగిల్స్: కె. సురేష్ – రజతం
ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్: కె. సురేష్, కె. విజయ – కాంస్యం

ఈ సందర్భంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ (Ramagundam Police Commissionerate) కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ క్రీడాకారులను శాలువాలతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పోలీసు విధుల్లో నిరంతరం ఒత్తిడితో పనిచేసే అధికారులు, సిబ్బందికి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.

క్రీడల్లో ప్రతిభ చూపుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని శాఖ తరఫున ప్రోత్సహిస్తూ అవసరమైన సహకారం అందిస్తామని సీపీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు మల్లేశం, శేఖర్, రమేష్, సీసీ సందీప్, ఆర్‌ఎస్‌ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, సభ్యులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : షెడ్యూల్‌కే మురిసిపోతున్నారు.. పాక్‌పై పార్థివ్ పటేల్ సెటైర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>