ఖైదీల సంస్కరణే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ఖైదీల సంస్కరణే ధ్యేయమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్బంగా వరంగల్ రేంజ్ ప్రిజన్స్ డీఐజీ. ఎం.సంపత్, ఎస్పీ అఖిల్ మహాజన్‌లతో కలిసి జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జైళ్లలోని ఖైదీల పునరావాసం (Prisoner Rehabilitation), వారిలో సానుకూల పరివర్తన తీసుకురావడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని అన్నారు.

క్షణికావేశంలో చేసిన తప్పుల వలన కుటుంబాలకు దూరంగా ఉండడమే కాకుండా మానసికంగా, ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందని (Collector Rajarshi Shah) వెల్లడించారు. ప్రతి రోజు యోగ, పుస్తక పఠనం వంటివి దినచర్యగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జైలు జీవితం ఖైదీల జీవితాల్లో మార్పునకు వేదిక కావాలని, సత్ప్రవర్తనతో సమాజంలో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ పి గోపిరెడ్డి, డిఎంహెచ్ఓ సాధన, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి. హుస్సేన్, జైలర్ ఎన్. చంద్రశేఖర్, జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>