కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. యావత్తు దేశాన్ని స్వాతంత్ర్య సంగ్రామంలో సంఘటితం చేసి ముందుండి శాంతి, అహింస మార్గాలలో నడిపించారని అన్నారు.
గాంధీజీ జీవితాన్ని అందరం స్పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. తన జీవితాన్ని మొత్తం భారతదేశ స్వాతంత్ర్యం కొరకు అర్పించారని కలెక్టర్ గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రతి ఒక్కరు గాంధీజీ చూపిన మార్గంలో పయనించాలని చెప్పారు. ఈ జయంతి వేడుకల్లో ఇంచార్జి అదనపు కలెక్టర్ రెవెన్యూ రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

