గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: బొజ్జు పటేల్

కలం, ఉట్నూర్ : జాతిపిత మహాత్మా గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచారని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్(Bojju Patel) అన్నారు. గాంధీజీ జయంతిని (Gandhi Jayanti) పురస్కరించుకుని గురువారం ఉట్నూర్‌లోని (Utnoor) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెడ్మ బొజ్జు పటేల్ (Bojju Patel) మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. హింసాత్మక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ శాంతి, సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీజీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గాంధీజీ ఆశయాలను కాపాడటంతోపాటు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వెడ్మ బొజ్జు పటేల్ స్పష్టం చేశారు.

Also Read : ఎల్ నినో ఎఫెక్ట్.. పాలమూరులో చేపల పెంపకానికి బ్రేక్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>