అర్హులందరికీ ఓటు హక్కు: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం మిగిలిపోయిన అర్హులైన పౌరులు, 18 ఏళ్లు నిండిన యువత, అలాగే తొలిసారి ఓటు హక్కు పొందనున్న వారి ఓటు నమోదు (Voter Registration)  కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్‌లను ఆదేశించింది.

సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల సవరణ జాబితాలో పేర్లు పొందుపరచబడని ఓటర్లను గుర్తించి, వారందరినీ తిరిగి ఓటరు జాబితాలోకి చేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి అర్హులను గుర్తించడంతో పాటు, దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక క్యాంపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ‘ఫారం-6’ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>