కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అహింస ఆయుధంగా స్వతంత్ర సమరంలో పోరాడిన యోధుడు పూజ్య బాపూజీ అని, ఆయన జీవితం మనందరికీ మార్గదర్శనం కావాలని రాష్ట్ర సర్వోదయ మండల్ జిల్లా ఇన్చార్జ్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా తెలంగాణ సర్వోదయ కమిటీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 157వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది దేశభక్తులను తయారు చేసి అహింసాయుతంగా పోరాటాలు నేర్పిన గాంధీజీ జీవితం ఆచరణీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి. సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి బి. సుందర్ రాజ్, కోశాధికారి పి. శివకుమార్, బి. మహేష్ బాబు, ఆసిఫ్ ఖాన్, రహమాన్, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

