కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ అనుసరించిన సత్యం, అహింస, శాంతి, సహనం, ధర్మం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమన్నారు.
మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరిస్తూ సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించాలని సూచించారు. యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

