కలం, వెబ్ డెస్క్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద ప్రార్థనా సమావేశం, శ్రద్ధాంజలి ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గాంధీజీ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన అనంతరం నాయకులంతా అక్కడ ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థనా సమావేశంలో పాల్గొని, మహాత్మా గాంధీ చూపించిన అహింస, సత్యం, సమభావనల మార్గాన్ని స్మరించుకున్నారు.
ఈ స్మారక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు , ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజహరుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్రనాయక్, పలువురు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.

