గంగనపల్లి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ప్రమాదం.. లైన్‌మెన్‌కు తీవ్రగాయాలు!

కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి మండలం గంగన్‌‌పల్లి గ్రామంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ (Ganganapally Substation) లో ఎల్‌సీ తీసుకునే క్రమంలో విద్యుద్ఘాతానికి గురై లైన్‌ మెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

గంగన్ పల్లి సబ్‌స్టేషన్‌లో ఆర్టీజీఎన్ గ్రేడ్-2 ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నజీర్ బుధవారం రాత్రి సబ్‌స్టేషన్‌‌లోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎల్‌సీ (LC) తీసుకునే క్రమంలో ఐసోలేటర్లను ఓపెన్ చేస్తుండగా అకస్మాత్తుగా ఎర్త్ అయి విద్యుత్ ప్రసరించింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>