కామారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కలం, నిజామాబాద్ బ్యూరో :  కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centre) ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. బాన్సువాడ సొసైటీ పరిధిలోని కొల్లూరు (Kollur) గ్రామంలో, బుడ్మి సొసైటీ పరిధిలోని తాడకోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఖరీఫ్ వరి ధాన్యం కోతలు ఇతర జిల్లాలతో పోలిస్తే ముందుగానే ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, వారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

కామారెడ్డి నియోజకవర్గంలో..

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు, సంబంధిత సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, కొనుగోలు, చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని షబ్బీర్ అలీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>