అక్టోబ‌ర్‌ 7న యాదగిరిగుట్టలో ‘ఆచార్య దేవోభవ’

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 7న యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో ‘ఆచార్య దేవోభవ’ (Acharya Devobhava) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏపూరి భాస్కర్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు.

కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ట్రస్మా నాయకులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. విద్యాసంస్థల పరిరక్షణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులను సన్మానించి వారిలో మరింత స్ఫూర్తిని నింపడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఆచార్య దేవోభవ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ వివరించారు.

అడిషనల్ కలెక్టర్‌కు ఆహ్వానం

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏపూరి భాస్కర్‌రావును ట్రస్మా నాయకులు కలిసి ఈ నెల 7న జరిగే కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ ఆధ్వర్యంలో నాయకులు అడిషనల్ కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

‘ఆచార్య దేవోభవ’ మంచి కార్యక్రమం: డీఈఓ బిక్షపతి

యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతిని ట్రస్మా జిల్లా నాయకులు కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 7న యాదగిరిగుట్టలో జరిగే కార్యక్రమానికి హాజరవుతానని డీఈఓ హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ బిక్షపతి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు ఇన్‌స్పైర్ అవార్డుల నామినేషన్ల కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకురావడానికి పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇన్‌స్పైర్ అవార్డులు అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ట్రస్మా రాష్ట్ర నాయకులు బండిరాజుల శంకర్, అచ్చయ్య గౌడ్, జిట్టా ధనాపరెడ్డి, ఐలేని రాంరెడ్డి, తండా కృష్ణంరాజు, ఆర్. జంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్, కోశాధికారి మరియన్న, అసోసియేట్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు సత్యనాథ్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>